![]() |
![]() |

చెఫ్ మంత్ర అంటే చాలా మంచి ఫుడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించే షో.. ఈ షోకి దాదాపు ఇండస్ట్రీ నుంచి చిన్నా పెద్దా సెలెబ్స్ వచ్చి వంటలు చేసి ఫన్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఈ షోకి రష్మీ, గెటప్ శీను వచ్చారు. "రష్మీ నేను నిన్ను పదేళ్ల నుంచి చూస్తున్నా అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావ్"..కారణం ఏమిటి అని మంచు లక్ష్మి అడిగేసరికి.."నేను సాత్వికాహారం తినడానికే ఇష్టపడతాను. పెద్ద టెన్షన్స్ అవి పెట్టుకోను..అలాగే ఒక ట్రైనర్ ద్వారా వెయిట్ లాస్ అవడానికి కావాల్సిన ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాను.
అంటే దాదాపు 10 అంతస్తుల వరకు మెట్ల మీద నడిచే వెళ్తాను. అన్ని మెట్లు ఎక్కినా ఆయాస పడను..ఎందుకంటే నా టార్గెట్ అది. ఎన్ని మెట్లెక్కినా ఆయాసపడకూడదు అని. చాలామంది నన్ను వెయిట్ లాస్ కి సంబంధించి నేను ఏ టిప్స్ ఫాలో అవుతానో చెప్తూ వీడియోస్ చేయమని అడిగారు. కానీ నేను అలా చేయను. ఎందుకు అంటే నేను ఒక ప్రొఫెషనల్ దగ్గర ట్రైన్ అవుతున్నాను. నాకు సెట్ ఐనవి వేరే వాళ్లకు సెట్ కాకపోవచ్చు. దాంతో వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఎవరికీ ఇది చేయండి అని సజెస్ట్ చేయను. అలాగే నేను ఇదే తినాలి అని ఒక పర్టికులర్ గా ఏ నియమం పెట్టుకొను..అదే నా బ్యూటీ సీక్రెట్ కూడా ". అని తన హెల్త్ సీక్రెట్ గురించి మంచు లక్ష్మి షో చెఫ్ మంత్రలో రివీల్ చేసింది.
![]() |
![]() |